ప్రేమించాడు… నరకం చూపించాడు

ప్రేమ పేరుతో వల వేశాడు…. నువ్వు లేక నేను లేను అంటూ పెళ్లి పీటల వరకు తీసుకెళ్ళాడు…. జీవితాంతం తోడుంటానంటూ ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా తాళి [more]

Update: 2020-06-26 13:17 GMT

ప్రేమ పేరుతో వల వేశాడు…. నువ్వు లేక నేను లేను అంటూ పెళ్లి పీటల వరకు తీసుకెళ్ళాడు…. జీవితాంతం తోడుంటానంటూ ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా తాళి కట్టాడు…. కానీ మోజు తీరి పోగానే చిత్తకార్తె కుక్క లా మారి పోయాడు… భార్య ముందే ఇతర మహిళలకు వల వేసి అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు….. భరించలేక పోయిన ఆ మహిళ భర్త దురాగతాలను సెల్ఫీ వీడియో ద్వారా వివరించి తనువు చాలించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన హైదరాబాద్ శివారు లోని శంషాబాద్ లో చోటుచేసుకుంది.

ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుని…

అతడి పేరు వెంకటేష్ చౌదరి…ప్రకాశం జిల్లా కు చెందిన వెంకటేష్, లావణ్య ను 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. జెట్ ఎయిర్ వేస్ లో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్….. గత కొంత కాలంగా హైదరాబాద్ శివారు లోని శంషాబాద్ వద్ద సీఎస్కే విల్లా లో కాపురం ఉంటున్నారు. అయితే భార్య పై మోజు తీరి పోవడంతో వెంకటేష్ బరితెగించాడు. గత కొంత కాలంగా ఇతర అమ్మాయిల తో అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకటేష్ భార్య లావణ్య ను మానసికంగా వేధింపులకు గురి చేయసాగాడు. దీంతో భర్త వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది లావణ్య… భర్త ఆగడాలు శృతి మించడంతో తట్టుకోలేక పోయింది. ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది లావణ్య. ఈ మేరకు గత రాత్రి ఇంట్లో భర్త వెంకటేష్ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఈ మేరకు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు…. తన భర్త దురాగతాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. ఈ మేరకు తమ కూతురి బలవన్మరణానికి కారకుడైన భర్త వెంకటేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News