8 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్

Update: 2017-01-20 05:49 GMT

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియకు వాహనాన్ని అడ్డుకున్న ఘటనలో 8మంది వైసీపీ కార్యకర్తల్ని తుళ్లూరు పోలీసులు అసుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం వెలగపూడి సచివాలయం వెళ్తుండగా అఖిల ప్రియకు చేదు అనుభవం ఎదురైంది. జగన్ రోడ్ షో జరుగుతున్న ప్రాంతం గుండా సచివాలయనికి వెళుతుండగా వాహనాలు నెమ్మదిగా వెళుతున్న క్రమంలో వైసీపీ కార్యకర్తలు అఖిల ప్రియను గుర్తించారు. అఖిల ప్రియ కారు ఎదురుగా వాటర్ టాంకర్ ఉండటంతో ఆమె వాహనం కొద్దిసేపు నిలిచిపోయింది. అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ ఆమె వాహనాన్ని దారి మళ్లించే క్రమంలో వైసీపీ కార్యకర్తలు కారును చుట్టుముట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్ అద్దాలపై గట్టిగా కొడుతూ వ్యతిరేకం గా నినాదాలు చేయడంతో పోలీసులు వాహనాన్ని అక్కడి నుంచి పంపి వేశారు. ఈ ఘటన పై జిల్లా sp కి అఖిల ప్రియ ఫిర్యాదు చేసారు. సీఎం కార్యాలయ అధికారులను కలిసేందుకు సచివాలయం వెళుతుండగా వైసీపీ మీటింగ్తో రోడ్ క్లోజ్ అయ్యిందని వైసీపీ కార్యకర్తల తీరుతో ఆందోళన చెందినట్లు అఖిల చెప్పారు.

వెలగపూడి దారిలో జగన్ ప్రోగ్రాం ఉన్నట్టు తమకు తెలియదని ., ముందుకు పోలేమని పోలీసులు ఆపి నాతో మాట్లాడుతుఅండగా నా కారుపై దాడి చేసేందుకు పలువురు వైసీపీ కార్యకర్తలు యత్నించారు – కారును వెనక్కితీసుకోడానికి కూడా వీలులేకుండా పోయింది – దాడి చేసిన వారు మద్యం తాగి ఉన్నారని మా డ్రైవర్ చెప్పాడు – పోలీసుల సాయంతో ఘటనస్థలం నుంచి బయటపడ్డాను అని లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యదు చేయలేదు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాల్లో దాడి జరిగినట్లు కనబడకపోయినా పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Similar News