హై రిస్క్ లో ఏపీ … ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. ఒక్కరోజులోనే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. [more]

Update: 2020-04-01 06:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. ఒక్కరోజులోనే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. కరోనాను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ చర్చిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారితో ఒక్కసారిగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87కు చేరుకుంది. ఈరోజు ఉదయం 9గంటలవ రకూ 373 నమూనాలను పరీక్షించగా 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 330 నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. కడప, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా పదిహేను పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 13, విశాఖపట్నంలో 11 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News