తెలంగాణకు గుడ్ న్యూస్... వేల కోట్లు ఖర్చు చేసి?

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాలుగు జాతీయ రహదారుల పనులను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసింది.

Update: 2022-01-23 03:36 GMT

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాలుగు జాతీయ రహదారుల పనులను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసింది. త్వరలో జాతీయ రహదారుల శాఖ దీనికి సంబంధించిన టెండర్లు పిలవనుంది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా నాలిగింటిని గతంలోనే ఎంపిక చేసినా దానికి సంబంధించిన అనుమతులు మంజూరు కాలేదు. కానీ తాజాగా అనుమతులు మంజూరు చేయడంతో నాలుగు జాతీయ రహదారుల పనుల ప్రారంభానికి మార్గం సుగమమయింది.

నాలుగు జాతీయ రహదారులు...
మెదక్ నుంచి సిద్ధిపేట 70 కిలోమీటర్లున్న రహదారిని జాతీయ రహదారిగా నిర్మిస్తారు. ఇందుకోసం 882 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఇక సిద్ధిపేట నుంచి ఎల్కతుర్తి కి 64 కిలోమీటర్ల జాతీయ రహదారి కోసం 578 కోట్లు ఖర్చు చేయనుంది. వలిగొండ నుంచి తొర్రూరు వరకూ ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ఏర్పాటు చేస్తారు. మొత్తం 69 కిలోమీటర్లున్న ఈ రహదారి కోసం 549 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. జనగామ నుంచి దుద్దెడ నంచి 45.5 కిలోమీటర్లున్న రహదారి కోసం 423 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. దీంతో ఆ ప్రాంత అభివృద్ధి వేగంగా జరుగుతుంది.


Tags:    

Similar News