నేడు తెలంగాణ బడ్జెట్.. హరీశ్ గంటన్నరపాటు?

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు

Update: 2022-03-07 02:35 GMT

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈరోజు బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, శాసనమండలిలో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటన్నర పాటు సాగే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని ఎన్నికల బడ్జెట్ గానే భావిస్తుండటంతో సంక్షేమ పథకాలకు ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేసినట్లు తెలిసింది.

అభివృద్ధి.. సంక్షేమం...
ప్రధానంగా దళితబంధుతో పాటు మరికొన్ని పథకాలకు కూడా నిధులు కేటాయించారని సమాచారం. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఈ బడ్జెట్ ను రూపొందించారని చెబతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తుండటంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ అంశంపై కొంత రచ్చ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా పెద్దయెత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఎన్నిరోజులు బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు.


Tags:    

Similar News