నేడు తెలంగాణ బడ్జెట్

తెలంగాణ బడ్జెట్ నేడు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ మూడు లక్షల మార్క్ ను దాటనుంది

Update: 2023-02-06 02:27 GMT

తెలంగాణ బడ్జెట్ నేడు శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ మూడు లక్షల మార్క్ ను దాటనుంది. శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది జరగనుండటంతో ఎన్నికల బడ్జెట్ గా దీన్ని భావిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమంగా నిధులను కేటాయిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది 2.56 లక్షల కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈసారి మూడు లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వినపడుతుంది.

సంక్షేమానికి...
ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు తోడుగా నూతన పథకాలకు కూడా నిధులు కేటాయించే అవకాశముంది. ఎక్కువగా సంక్షేమానికే నిధులు కేటాయింపులు జరుపుతారంటున్నారు. సొంత రాబడిపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఈ బడ్జెట్ లో కేటాంయిపులు జరపనున్నారు. అమ్మకం పన్ను ద్వారా నలభై వేల కోట్లు, జీఎస్టీ ద్వారా 42 వేల కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వరా 18 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివిధ మార్గాల ద్వారా...
ఇక భూముల అమ్మకం ద్వారా అధికంగానే ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కేంద్రం పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 21 వేల కోట్లు పైగానే వస్తాయని అంచనా ఉంది. దీంతో ఎన్నికల వేళ సంక్షేమానికి పెద్ద పీట వేస్తారంటున్నారు. రుణాలను ఎక్కువగా చూపి బడ్జెట్ లో కేటాయింపులు జరపుతారంటున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనమండలిలో శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.


Tags:    

Similar News