లైఫ్ స్టైల్: ఫ్యాషన్ లో ముక్కుపుడక.....

Update: 2018-02-14 04:18 GMT

ఆడవాళ్ళు ధరించే ప్రతి ఒక్కటి ఫ్యాషనే. ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము.సంపంగిలాంటి ముక్కుకు ఇది అందాన్ని ఇస్తుంది. దీనిని ఎక్కువగా స్త్రీలు ధరిస్తారు. ముక్కుపుడక అంటే మహిళలకు ఎంతో ఇష్టం.పూర్వకాలం నుంచి ముక్కుకు ముక్కుపుడక పెట్టుకునేవారు.అప్పుడు మన పెద్దవాళ్ల కేవలం చిన్న మరియు పెద్ద ముక్కుపుడకలు పెట్టుకునేవారు. కాని అంతగా డిజైన్స్ ఉండేవి కావు. కాని ఈ ముక్కుపుడకలో అనేక రకాలైన డిజైన్స్ ఇప్పుడు ఆధునిక కాలంలొ వస్తున్నాయి.ఒకప్పడు కేవలం వివాహితలు మాత్రమే ధరించేవారు.భర్త క్షేమంగా ఉండాలన్ని దీనిని ధరించేవారు.అందుకే దీనిని సౌభాగ్యానికి సంకేతంగా చేబుతారు.

పుడకలు ఇప్పుడు ఆధునిక కాలంలో కాలేజ్ అమ్మాయిలు కూడ ధరిస్తున్నారు.కోత్త కొత్త డిజైన్స్ లలో లభించే ఈ ముక్కుపుడకలు అందరు ఇష్టపడుతున్నారు.రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టుకుంటారు.ఎంత పేదవారైన దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకొని పెట్టుకుంటారు.దక్షిణ భారతదేశంలో కుడివైపుకు పెట్టుకుంటే,ఉత్తర భారతదేశంలో ఎడమవైపుకు పెట్టుకుంటారు. మరాఠీ మహిళలు ముక్కెరను ఎక్కువగా ఇష్టపడతారు.వత్తే ముక్కుపుడకలు కూడ మార్కెట్ లో లభిస్తున్నాయి.ఇప్పుడు పెళ్ళికాని అమ్మాయిలు వీటిని ఎక్కువగా ధరించడాన్కి ఇష్టపడుతున్నారు.బంగారు పుడక నుంచి వజ్రపు ముక్కుపుడక వరకూ,రింగులు కూడ ధరించడం ఫ్యాషన్ గా మారింది.బంగారంతో రకరకాల డిజైన్స్ మరియు ముత్యాలతో డిజైన్స్,రకరకాలైన రాళ్ళుతో డిజైన్స్ మార్కెట్ లో లభించడంతో కాలేజ్ అమ్మాయిలు,మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ముక్కుపుడకలో రకరకాలైన డిజైన్స్ రావడంతో మరి ఎక్కువగా యువత ధరిస్తున్నారు.ఇప్పుడు ఇది న్యూ ఫ్యాషన్ ట్రేండు అయ్యింది.....

Similar News