దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం, వెండి ధర కొంత తగ్గింది. పది గ్రాముల బంగారం ధర పై ఐదు వందల వరకూ తగ్గింది.

Update: 2022-01-29 01:44 GMT

భారత్ లో పసిడి అంటే ఇష్పపడే వారు ఎక్కువ. నాగరితక పెరుగుతున్నా, కొత్త జనరేషన్ లు వస్తున్నా బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. బంగారం అంటే యువత కూడా ఆసక్తి కనపరుస్తుండటంతో దీనికి విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే భారత్ లో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. కాలాలతో నిమిత్తం లేకుండా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఎన్ని జ్యుయలరీ షాపులు వచ్చినా ఎవరి మార్కెట్ వారిదే. ఆభరణాలు ఆకట్టుకుంటే కొనుగోళ్లు పెరుగుతాయి.

ధరలు ఇలా.....
దేశంలో బంగారం, వెండి ధర కొంత తగ్గింది. పది గ్రాముల బంగారం ధర పై ఐదు వందల వరకూ తగ్గింది. అలాగే కిలో వెండిపై పన్నెండు వందల రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,150 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,250 రూపాయలు ఉంది. కిలో వెండి ప్రస్తుతం 66.300 రూపాయలు ఉంది.


Tags:    

Similar News