బంగారం తగ్గింది... గుడ్ టైమ్

బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. తులం బంగారంపై కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తగ్గినా, ఇది కొనుగోళ్లకు మంచి సమయమంటున్నారు

Update: 2022-01-12 01:54 GMT

బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో? ఎప్పుడు పెరుగుతుందో ఎవరికి తెలియదు. మార్కెట్ నిపుణులు కూడా దీనిని గురించి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో బంగారం ధర తగ్గక పోగా మరింత పెరిగింది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్నా బంగారం ధరల్లో మాత్రం పెద్దగా మార్పులు లేవు. కొన్ని రోజులు స్థిరంగా, కొన్ని రోజులు స్వల్పంగా ధరలు తగ్గుతున్నాయి. పెరగడం చాలా తక్కువగా జరుగుతుందని నిపుణులు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

స్వల్పంగా.....
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. తులం బంగారంపై కేవలం ఇరవై రూపాయలు మాత్రమే తగ్గినా, ఇది కొనుగోళ్లకు మంచి సమయమంటున్నారు. పెరిగితే ఎక్కువగా, తగ్గితే తక్కువగా బంగారం ధరల్లో మార్పులు ఉండటం విశేషం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ప్రస్తుతం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర44,700 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,760 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News