బంగారం ధర మళ్లీ తగ్గిందోచ్

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-01-07 02:04 GMT

బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వరసగా బంగారం ధరలు తగ్గుతుండటం కొనుగోలుదారులకు ఆనందం కల్గిస్తుంది. ఈరోజు రూ.380లు తగ్గింది. బంగారం ధరలు పడిపోవడానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయాయి. అమెరికాలోనూ బంగారం ధరలు తగ్గిపోతుండటంతో ఆ ప్రభావం అన్ని ప్రాంతాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ధరలు ఇలా....
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,950 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,040 రూపాయలు ఉంది. వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. కిలో వెండిపై రూ.800 లు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర మార్కెట్ల 60,846 రూపాయలకు ఉంది.


Tags:    

Similar News