Congress : నేటి నుంచి రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించనున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించనున్నారు. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 1,300 కిలోమీటర్ల మేరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు బీహార్ లో ప్రారంభమయ్యే ఓటర్ అధికార యాత్రను రాహుల్ గాంధీ వచ్చే నెల 1వ తేద రాజధాని పాట్నాలో ముగించనున్నారు. రాహుల్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
బీహార్ లో జరగనున్న...
అధికార్ యాత్ర ముగింపు రోజున భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బీహార్ లో పెద్దయెత్తు ఓటరు జాబితా నుంచి గల్లంతయ్యాయని ఆరోపిస్తూ రాహుల్ ఈ యాత్రను చేపట్టారు. ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. మరొకవైపు ప్రజా ఉద్యమంగా మలిచేందుకు ఈ యాత్రను రాహుల్ చేపట్టారు. మరొకవైపు నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బీహార్ ఓటర్ల జాబితా, రాహుల్ ఆరోపణలపై స్పందించే అవకాశాలున్నాయి.