ఎన్టీఆర్ దాసరి ఎవరంటే....!!

Update: 2018-11-02 03:15 GMT

క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్ లో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు. మహానాయకుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కథానాయకుడు సినిమా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసిందని టాక్ నడుస్తుంది. ఈ కథానాయకుడు సినిమా లో అనేకమంది నటీనటులు గెస్ట్ పాత్రలో మెరవబోతున్నారు. ఇప్పటికే రానా, రకుల్ ప్రీత్, డాక్టర్ భరత్, విద్యాబాలన్, సుమంత్ వంటి నటీనటులు ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహిత పాత్రల్లో నటించారు. అలాగే ఎన్టీఆర్ తో సంబంధమున్న కొంతమంది డైరెక్టర్స్ పాత్రలను కూడా టాలీవుడ్ లోని కొంతమంది డైరెక్టర్స్ పోషిస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు దేవి ప్రసాద్ గుమ్మడిగా.... క్రిష్ కేవీ రెడ్డిగా నటిస్తున్నారు. అయితే దర్శకుడు ఎన్ శంకర్ కూడా విఠలాచార్య పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం ఉంది. తాజాగా ఎన్టీఆర్ కి సన్నిహితుడిగా.. ఎన్టీఆర్ తో అనేక సినిమాలు డైరెక్ట్ చేసిన దాసరి నారాయణరావు గా ఎన్టీఆర్ లో ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం చాలామంది దర్శకులను క్రిష్ ఈ సినిమా లో భాగస్వామ్యులను చేస్తున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ కథానాయకుడు తదుపరి షెడ్యూల్ లో దాసరి నారాయణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం.

Similar News