సమంత మళ్ళీ పెంచేసిందా?

టాలీవుడ్ లక్కీ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే సమంత అనేస్తాం మనమంతా. ఎందుకంటే ఆమె ఏ సినిమా చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇక రీసెంట్ [more]

Update: 2019-07-28 13:32 GMT

టాలీవుడ్ లక్కీ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే సమంత అనేస్తాం మనమంతా. ఎందుకంటే ఆమె ఏ సినిమా చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇక రీసెంట్ గా ఆమె చేసిన ఓ బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్నా ఈసినిమా యూఎస్ లో కూడా దుమ్మురేపుతోంది. అమెరికా లో ఈమూవీ ఏకంగా వన్ మిలియన్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

నిజానికి వన్ మిలియన్ మార్క్ సాధించడం అనేది మన స్టార్ హీరోస్ కి తప్ప ఒక రేంజ్ హీరోస్ కి అయితే సాధ్యం కానీ విషయం. కానీ సమంత ఆ ఫీట్ ని ఈజీగా దాటేసింది. ఇక ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే క్రేజ్ తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడ పెంచేసింది. అవును గత కొన్ని రోజులు నుండి సామ్ రెమ్యూనరేషన్ పైనే వార్తలు నడుస్తున్నాయి. ఈమె తన నెక్స్ట్ సినిమాల కోసం రెమ్యూనరేషన్ పెంచేసిందట. ఇప్పుడు తన పారితోషకాన్ని గతంలో తీసుకున్న దానికంటే ఒక కోటి మేర ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ రూమర్ బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ ఆమె పెంచిన ఆశర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె సక్సెస్ రేషియో అలా ఉంది. సౌత్ ఇండియా లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార మొదట ప్లేస్ ఉంది.

Tags: