నాని కాంప్రమైజ్ అయ్యాడా..!!

Update: 2018-10-28 04:05 GMT

నాని ఈ ఏడాది రెండు సినిమాల ప్లాప్ తో కాస్త డల్ అయ్యాడు. వరసగా ఎనిమిది సినిమా ల హిట్ కి కృష్ణార్జున యుద్ధం సినిమా బ్రేక్ వేసింది. వరస విజయాలతో దూకుడు చూపించిన నానికి కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాల ప్లాప్ లతో ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. మళ్ళీ రావా హిట్ తో ఉన్న దర్శకుడు గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నాని క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉన్న జెర్సీ సినిమా చేస్తున్నాడు. కథ బాగా నచ్చడం తో నాని ఈ సినిమాకి సై అనడమే కాదు.. అప్పుడే ఈ సినిమాని పట్టాలెక్కించేసాడు కూడా. అలాగే ఈ సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ కూడా పెడుతున్నారట.

పీరియాడిక్ డ్రామా......

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఏ ఈసినిమా మీదున్న నమ్మకంతో నాని దర్శక నిర్మాతలకు భారీ బడ్జెట్ అంటే... ప్రస్తుతం నాని చేసిన సినిమాలకన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా చేయమని.. క్వాలిటీ పరంగా సినిమా రీచ్ గా ఉండాలని చెప్పాడట. అవసరమైతే తాను రెమ్యునరేషన్ కూడా తీసుకోనని.. సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇవ్వమని నాని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. నాని అలా చెప్పడమే తరువాయి. ఈ సినిమా ని మీడియం బడ్జెట్ తో చెయ్యాలనుకున్న దర్శకనిర్మాతలు ఇపుడు ఈ సినిమాకి ఖర్చు బాగా పేటెయ్యడానికి రెడీ అయ్యారట. అందులో భాగంగానే మ్యూజిక్ డైరెక ని అనిరుద్ ని తీసుకోవడం జరిగిందట.

రెండు సినిమాలు ప్లాప్ కావడంతో....

మరి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా అనే కాన్సెప్ట్ ఈమధ్యనే టాలీవుడ్ లో హైలెట్ అవుతూ వస్తుంది. ఇక నాని కూడా ఎలాగూ రెండు సినిమాల ప్లాప్ తో ఉన్నాం.. ఈ సినిమా హిట్ అయితే కాస్త మార్కెట్ పెంచుకోవచ్చని ఉద్దేశ్యంతోనే పారితోషకాన్ని వదిలి లాభాల్లో వాటా దారి పట్టదంటున్నారు. ఏదైనా రెండు ప్లాప్ ల వల్ల నాని కాంప్రమైజ్ అయినట్లుగానే కనబడుతుంది.

Similar News