సూర్య కష్టాలు మాములుగా లేవు

Update: 2018-05-10 07:14 GMT

ప్రస్తుతం అల్లు అర్జున్ కు నా పేరు సూర్య కలెక్షన్స్ కష్టాలు మొదలయ్యాయి. నిన్నటిదాకా ముక్కుతూ మూలిగిన నా పేరు సూర్య ఇప్పుడు మహానటి రాకతో.. మరిన్ని కష్టాల్లో పడింది. నా పేరు సూర్య కి యావరేజ్ టాక్ పడింది. ఇక అల్లు అర్జున్ క్రేజ్ కూడా కలెక్షన్స్ ని లేపలేకపోయాయి. ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న నా పేరు సూర్య కలెక్షన్స్.. నిన్న మహానటి విడుదలై విజయవంతమైన టాక్ వచ్చాక మరింత ఢీలా పడ్డాయి. మహానటి సినిమా హిట్ అవడం.. నా పేరు సూర్య కలెక్షన్స్ డల్ అవడం జరిగాయి. ఇక ఈ రోజు జరగబోయే నా పేరు సూర్య సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఇక మహానటి క్రేజ్ ముందు నా పేరు సూర్య ని పవన్ కూడా కాపాడలెడు అంటున్నారు. ఇకపోతే ఈ ఐదు రోజుల్లో నా పేరు సూర్య అంతంత మాత్రం కలెక్షన్స్ ని మాత్రమే కొల్లగొట్టింది.

ఏరియా: ఐదు రోజుల కలెక్షన్స్ కోట్లలో...

నైజం 10.8

సీడెడ్ 5.11

ఉత్తరాంధ్ర 4.18

గుంటూరు 3.64

తూర్పు గోదావరి 3 .05

పశ్చిమ గోదావరి 2.34

కృష్ణ 2.20

నెల్లూరు 1.26

టోటల్ ఏపీ మరియు టీస్ కలెక్షన్స్: 32.58 కోట్లు

Similar News