తన కోరికను బయట పెట్టిన ఐశ్వర్యరాయ్

Update: 2018-08-19 09:00 GMT

తన నటనకు..అందంకు ఫిదా అవ్వని వారు ఎవరు ఉండరు. ఇప్పటికి ఆమె సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎవరో కాదు భారతదేశ అందాల రాశి ఐశ్వర్యరాయ్. అయితే ఆమె రీసెంట్ గా తన మనసులో కోరికను బయట పెట్టింది. తన జీవిత చరిత్ర తెరకెక్కాలని తాను కూడా కోరుకుంటున్నానని తన మనసులో కోరికను బయట పెట్టింది ఐశ్వర్యరాయ్.

మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పింది. అంతేకాదు తన జీవితంలో ఉన్న కొన్ని కోణాలు ప్రజలకు తెలియాలని..నేను ఏది దాచాలనుకోవడం లేదని..అన్ని ప్రజలకు తెలియాలని చెప్పింది. తన జీవిత చరిత్ర సినిమాగా తీస్తే చాలా బాగుంటదని చెప్పింది ఐషు. బాలీవుడ్ లో ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించడానికి చాలానే ప్రయత్నాలు జరుగుతున్నట్టు గతకొంత కాలం నుండి అక్కడ మీడియా వారు జోరున ప్రచారం చేస్తున్నారు.

చిన్న ఫామిలీ నుండి వచ్చిన ఐశ్వర్యరాయ్ అసలు బాలీవుడ్ లో కి ఎలా ఎంటర్ అయింది..ఆమె అందం వెనుక రహస్యం ఏంటి..టాప్ హీరోయిన్ గా ఎలా అయింది..అభిషేక్ ను ఎందుకు పెళ్లి చేసుకుంది. ఇలా చూస్తే ఆమె జీవితం లో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి. వాటికి తోడు ఆమె పెళ్ళికి ముందు కొంత మంది హీరోస్ తో అఫైర్స్ ఉన్నాయి. మరి అవి ఇందులో చూపిస్తారో లేదో చూడాలి. కానీ ఐషు మాత్రం తన జీవితంకి సంబంధించి అన్ని విషయాలు ప్రజలకు తెలియాలనటం విశేషం. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఎవరు డీల్ చూస్తారో చూడాలి.

Similar News