భారత్ లో అందుబాటులోకి వచ్చిన Acer Nitro 5 గేమింగ్ ల్యాప్ టాప్

భారతదేశంలో Acer Nitro 5 (2022) ప్రారంభ ధర రూ. 84,999గా తెలిపారు. బేస్ వేరియంట్ ఇంటెల్ కోర్ i5-12500H ప్రాసెసర్‌తో పాటు

Update: 2022-04-05 08:33 GMT

Acer Nitro 5 (2022) 12వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5, కోర్ i7 ప్రాసెసర్ లతో, Nvidia GeForce RTX 30-సిరీస్ GPU భారతదేశంలో ప్రారంభించబడింది. కొత్త Acer గేమింగ్ ల్యాప్‌టాప్, స్పోర్టింగ్ మోడల్ నంబర్ AN515-18 గా జనవరిలో జరిగిన CES 2022లో ఆవిష్కరించారు. ఇది 144Hz డిస్‌ప్లే, 16GB వరకు RAM, RGB-బ్యాక్‌లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. నైట్రో 5 (2022)లో డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్, థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం క్వాడ్-ఎగ్జాస్ట్ పోర్ట్ డిజైన్ లు కూడా ఉన్నాయి. ఇది CPU, GPU ఓవర్‌క్లాకింగ్‌ని ప్రారంభించడానికి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌తో ప్రీలోడ్ చేయబడింది.

భారతదేశంలో Acer Nitro 5 (2022) ధర
భారతదేశంలో Acer Nitro 5 (2022) ప్రారంభ ధర రూ. 84,999గా తెలిపారు. బేస్ వేరియంట్ ఇంటెల్ కోర్ i5-12500H ప్రాసెసర్‌తో పాటు 8GB RAMతో వస్తుంది. ల్యాప్‌టాప్ టాప్-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో ఇంటెల్ కోర్ i7-12700H ప్రాసెసర్ ఎంపికతో పాటు 16GB RAM ధర రూ. 1,09,999 గా నిర్ణయించారు. లభ్యత పరంగా Acer Nitro 5 (2022) Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, Amazon, Croma, విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్ రెండు వేరియంట్‌లు కూడా Acer India వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడ్డాయి. CES 2022లో, Acer Nitro 5 (2022) EUR 1,549 (దాదాపు రూ. 1,30,900) ప్రారంభ ధరతో ప్రారంభించబడింది.
Acer Nitro 5 (2022) స్పెసిఫికేషన్‌లు
Acer Nitro 5 (2022) Windows 11 Homeలో రన్ అవుతుంది. ఇది 15.6-అంగుళాల పూర్తి-HD (1,920x1,080 పిక్సెల్‌లు) ComfyView LED-బ్యాక్‌లిట్ TFT IPS డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 16:9 యాస్పెక్ట్ రేషియో, 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 170-డిగ్రీల వ్యూవింగ్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. Acer ల్యాప్‌టాప్ 12th-generation Intel Core i5-12500H లేదా Intel Core i7-12700H ప్రాసెసర్ తో రానుంది. 12GB డ్యూయల్ ఛానల్ DDR4 RAM, 512GB M.2 PCIe SSD స్టోరేజ్ తో 1TB 2.5-inch HDD తో రానుంది. అంతేకాకుండా Nvidia GeForce RTX 3050 గ్రాఫిక్స్ 4GB of DDR6 VRAM కూడా ఉండనున్నాయి.


Tags:    

Similar News