జాబ్ మేళా: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో

ఉద్యోగాల భర్తీకి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నడుంబిగించింది. ఈ జాబ్ మేళాలో

Update: 2023-12-15 05:09 GMT

jobs for youngsters

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) 'సేవా డేస్‌' పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు 11-23 వరకు తెలుగు రాష్ట్రాల్లో సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, కో ఆర్డినేటర్‌ సురేశ్‌ రెడ్డి వెంకన్నగరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగుతున్నాయి. 16వ తేదీన ఆరోగ్యంపై అవగాహనకు నెక్లెస్ రోడ్డులో 5కే రన్ నిర్వహిస్తున్నారు. 18న వరంగల్లో మెగా జాబ్మేళాతో పాటు వీల్చైర్స్పంపిణీ, హెల్త్క్యాంప్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 17న వికారాబాద్ లో కృత్రిమ అవయవాల పంపిణీ, 23న రవీంద్రభారతిలో సేవాడేస్ ముగింపు సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నడుంబిగించింది. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న 35 కంపెనీలు సుమారు 1500నుంచి 2000 వరకూ ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. వరంగల్ లో ఉన్న క్వాడ్రంట్ టెక్నాలజీస్ సంస్థలో డిసెంబర్ 18వ తేదీన ఉదయం 9నుంచి ఐదుగంటల వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బి.టెక్, ఎం.టెక్, ఎంబిఏ, ఎంసిఏ, ఫార్మసీలలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏదేని డిగ్రీ పట్టా కలిగి ఉండాలి. 2021- 2024 మధ్య ఉత్తీర్ణులై ఉండాలి. జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.


Tags:    

Similar News