5447 Jobs in SBI : దరఖాస్తు చేసుకోవడానికి రేపు (డిసెంబర్ 17) చివరి తేదీ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐకు చెందిన వివిధ సర్కిళ్లలో

Update: 2023-12-16 02:11 GMT

sbi jobs

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐకు చెందిన వివిధ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,447 సీబీవో పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయాలని భావిస్తూ ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం, బ్యాంకింగ్‌ రంగంలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో పని చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 11 నుంచి ప్రారంభంకాగా.. ఈ డిసెంబర్ 17తో గడువు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో 425 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎస్బీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది.

సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల కోసం వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం రూ.36,000 నుండి మొదలై రూ.63,840 వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లలో ఉన్నాయి. ముఖ్యంగా దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 17 కావడంతో వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం చాలా మంచిది. దరఖాస్తు ఫీజు రూ. 750 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదని తెలిపారు. ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ 2024 జనవరి నెలలో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం www.sbi.co.in ని సంప్రదించండి.


Tags:    

Similar News