నీట్ పరీక్షల తేదీ ఖరారు.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి మే 6వ తేదీ వరకూ MBBS, BDS వైద్యకోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 543..

Update: 2022-04-07 09:27 GMT

న్యూ ఢిల్లీ : ప్రతిష్టాత్మక వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ పరీక్ష తేదీల షెడ్యూల్ ను ప్రకటించింది. MBBS, BDS వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తోంది. జులై 17న నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ నీట్ పరీక్ష జరుగుతుందని తెలిపింది.

నేటి నుంచి మే 6వ తేదీ వరకూ MBBS, BDS వైద్యకోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 543 నగరాలు, పట్టణాలతో పాటు వివిధ దేశాల్లోని పలు ప్రాంతాల్లో నీట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంగ్లీషు, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, జువాలజీ విభాగాల్లో 50 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం సమయం కేటాయించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షలమంది ఈ NEET పరీక్షకు హాజరవుతారని అంచనా.


Tags:    

Similar News