లేఆఫ్ కి బదులు జీతంలో కోత : చిప్ రారాజు ఇంటెల్

నిపుణులు ఇంటెల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నవేళ..

Update: 2023-02-02 07:20 GMT

intel employees, employee salaries slash, google employees

ట్విట్టర్ తో మొదలైన లేఆఫ్ ను.. దాదాపు అన్ని టెక్ కంపెనీలు అనుసరిస్తున్నాయి. కానీ.. చిప్ రారాజు అయిన ఇంటెల్ మాత్రం లేఆఫ్ కి బదులు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ సీఈఓ స్థాయి నుండీ.. కిందిస్థాయి ఉద్యోగుల వరకూ ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది ఇంటెల్. నిపుణులు ఇంటెల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నవేళ.. ఇంటెల్ మాత్రం భిన్నంగా ఆలోచించిందని కొనియాడుతుండటం విశేషం. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది.

ఇప్పటికే శ్రీలంక, చైనా, పాకిస్థాన్ దేశాలు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో .. వేతనం కొంత తగ్గినా పర్వాలేదు కానీ.. ఉన్నపళంగా ఉద్యోగం పోతే కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఇంటెల్ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనని అంటున్నారు నిపుణులు. ఇంటెల్ తీసుకున్న ఈ నిర్ణయంతో సంస్థ సీఈఓ పాట్ గెల్ సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం జీతాల్లో కోత విధించనున్నారు.




Tags:    

Similar News