Layoffs: ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ఐబీఎం

పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తూ

Update: 2024-03-05 05:16 GMT

Layoffs:పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. IBM సంస్థ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమైంది. మరో రౌండ్ గ్లోబల్ గా ఉద్యోగాల కోతలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు వెళ్లిపోవాలనుకుంటే తమకు చెప్పొచ్చని.. ఆయా ఉద్యోగులు అనుకున్న దిశగా ముందుకు సాగాలని కోరుతున్నట్లు తెలిపింది. కంపెనీలో ఉద్యోగులను తగ్గించడానికి పలు ప్రాంతాల విభాగాలకు సమాచారం అందింది.

గతేడాది 3900 మంది ఉద్యోగుల్ని తొలగించింది ఐబీఎం. ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తున్న కంపెనీ.. స్వచ్ఛందంగా బయటకు వెళ్లాలనుకునేవారిని ముందుకురావాలని కోరింది. నాలుగో త్రైమాసికంలో (Q4) ఆదాయం తక్కువగా ఉండడంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు సంస్థ తెలిపింది. 2024 చివరికల్లా లాభాలను సొంతం చేసుకోవాలని ఇటీవల ఐబీఎం సీఎఫ్ఓ జేమ్స్ కవనా చెప్పారు. గత నెలలో, IBM CFO జేమ్స్ కవనాగ్ మాట్లాడుతూ, కంపెనీ లక్ష్యం పొదుపులో 2024 చివరి నాటికి $3 బిలియన్ల వార్షిక రన్ రేట్ ను సాధించాలి. తాజా ఉద్యోగ కోతల్లో ఎంటర్‌ప్రైస్ ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ (EO&S), Q2C మిషన్స్, ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్, HR విభాగాలలో ఉన్నాయి. యాన్యువల్ క్యాష్ టార్గెట్స్ అందుకోలేకపోవడం, పెట్టుబడుల ఉపసంహరణ కారణాలతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఐబీఎం తెలిపింది.


Tags:    

Similar News