గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇవి గుర్తు పెట్టుకోండి!!

ఏపీ ప్రభుత్వం గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఆ పై విద్యార్హత కలిగిన

Update: 2023-12-08 03:55 GMT

ఏపీ ప్రభుత్వం గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఆ పై విద్యార్హత కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు. కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 897 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు షార్ట్ లిస్ట్ చేస్తారు. మెయిన్ పరీక్షలను ఆ తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్స్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్ లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు.

APPSC Group 2 విభాగాల వారీగా ఖాళీలివే :
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 212
ఆర్ధిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 23
జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 161
లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ : 12
లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 10
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3: 4
డిప్యూటీ తహసిల్దార్(గ్రేడ్-ii): 114
సబ్-రిజిస్త్రార్: 16
ఎక్సైజ్ సబ్-ఇనస్పెక్టర్ : 150
LFB అండ్‌ IMS అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ : 18

APPSC గ్రూప్ 2 పోస్టులు (ఎగ్జిక్యూటివ్ పోస్టులు) :
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
డిప్యూటీ తహసీల్దార్
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
సహాయ అభివృద్ధి అధికారి
ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్
మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III
పంచాయితీ రాజ్ అండ్‌ గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి
అసిస్టెంట్ రిజిస్ట్రార్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I


APPSC గ్రూప్ 2 పోస్టులు (నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు) :
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD, లా, ఫైనాన్స్, లెజిస్లేచర్ మొదలైన వివిధ విభాగాలు)
సీనియర్ ఆడిటర్
సీనియర్ అకౌంటెంట్ (HOD, డిస్ట్రిక్ట్, ఇన్సూరెన్స్, వర్క్స్ అకౌంట్స్ మొదలైన వివిధ విభాగాలు)
జూనియర్ అసిస్టెంట్ (కార్మిక, PH అండ్‌ ME, చక్కెర అండ్‌ చెరకు, వ్యవసాయం, రోడ్లు అండ్‌ భవనాలు మొదలైన వివిధ విభాగాలు)

కొత్తగా ప్రకటించిన సిలబస్ ప్రకారం 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. ఒక్కో సెక్షన్ కు 30 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు అర్హులు అవుతారు. మెయిన్స్‌లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు. గ్రూప్ - 2, గ్రూప్ -3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు (సీపీటీ) పాస్ కావాల్సిందే. 100 మార్కులకి నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News