నయన్ పెళ్లి ఎప్పుడో తెలుసా?

నటి నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ గురించి సౌత్ ఇండియా మొత్తం తెలుసు. వీరు ప్రేమికులు అని అధికారికంగా ప్రకటించుకోకపోయినా వారు సన్నిహితంగా ఉండే [more]

Update: 2019-09-27 08:53 GMT

నటి నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ గురించి సౌత్ ఇండియా మొత్తం తెలుసు. వీరు ప్రేమికులు అని అధికారికంగా ప్రకటించుకోకపోయినా వారు సన్నిహితంగా ఉండే తీరు చూస్తుంటే అందరికి అర్ధం అవుతుంది. ఇద్దరూ కలిసి ఈవెంట్స్ కి వెళ్లడం, ప్రతి ఫంక్షన్ లో ఒకరికొకరు సన్నిహితంగా ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం మనం చూస్తున్నాం. అయితే వీరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని ఆమధ్య వార్తలు వచ్చాయి.

త్వరలో వెల్లడి….

తాజాగా ప్రకారం నయనతార, విఘ్నేష్ లు ప్రస్తుతం సహజీవనంలో మాత్రమే ఉన్నారని, అతి త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లో వీరి పెళ్లి ఉండబోతుందని వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తుంది. నయన తారకు ఇప్పటికీ చేతి నిండా సినిమాలున్నాయి. సైరా.. నరసింహారెడ్డి రిలీజ్ కు రెడీ గా ఉంది. అలానే తమిళంలో విజయ్ తో బిగిల్ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో నయన్ పెళ్లి చేసుకుంటుందా? అనే అనుమానాలకు త్వరలోనే బ్రేక్ పడనుంది.

 

Tags:    

Similar News