నేను రౌడీనే అందుకే నా ఊరు బాగుంది - జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-07-23 11:52 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రౌడీనేని, అందుకే తాడిపత్రి బాగుందని అన్నారు. రాష్ట్రమంతటామున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే తనను ఒక్కడ్నే గెలిపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రి ప్రజలు తనకు దేవుళ్ళని. వాళ్ల కోసం నేను ఎంత దూరమైన వెళ్తానని అన్నారు. అనంతపురం జిల్లా డీపీవో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడన్న జేసీ ఆయన అక్రమాలకు పాల్పడలేదని డీపీవోను చెప్పమనడండి అని జేసీ ఎదురు ప్రశ్నించారు.

చంద్రబాబుకు విధేయుడిని...

తాను టీడీపీలోకి చేరడానికి కారణం చంద్రబాబు అని, ఎందుకుంటే చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని, తనకు న్యాయం చేస్తానంటే ఎవరి దగ్గరికి అయినా ఆధారాలు తీసుకొని వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరూ తనలా బతకలేదని, తాను చంద్రబాబుకి విధేయుడినని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటా లేవమంటే లేస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తాను ఎవరినీ పట్టించుకోనని, తాడిపత్రి అభివృద్ధిమాత్రమే తనకు ముఖ్యమని ఆయన అన్నారు.


Tags:    

Similar News