గర్భిణుల కోసం ప్రత్యేక వాహనాలు... జగన్ జెండా ఊపి

గర్భిణుల కోసం అత్యవసర వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సిద్దం కానున్నాయి

Update: 2022-04-01 01:35 GMT

గర్భిణుల కోసం అత్యవసర వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వాహనాలు నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సిద్దం కానున్నాయి. దాదాపు 500 వాహనాలను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. బెంజి సర్కిల్ లో జరిగే ఈ కార్యక్రమానికి జగన్ తో పాటు మంత్రులు కూడా హాజరవుతారు. వైఎస్సార్ తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలో భాగంగా 500 ఏసీ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

నెలలు నిండిన వారిని...
నెలలు నిండిన వారిని ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఈ వాహనాన్ని వినియోగిస్తారు. వైఎస్సార్ తల్లీ, బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలను మరింత విస్తృత పర్చేందుకు జగన్ ప్రభుత్వం ఈ వాహనాలను కొనుగోలు చేసింది. ప్రసవం అనంతరం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం ఐదు వేల రూపాయలు ఇచ్చి తల్లి, బిడ్డను క్షేమంగా ఇంటివద్ద దిగబెట్టి వస్తారు. ఈ వాహనాలను జెండా ఊపి జగన్ నేడు ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News