వైసీపీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే తిరుగుబాటు

పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావును సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఆయనను ప్రారంభోత్సవానికి రాకుండా అడ్డుకున్నారు

Update: 2021-12-30 14:18 GMT

పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావును సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఆయనను ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారు. పాయకరావు పేట మండలం రాజవరం గ్రామంలో తాగునీటి పధకాన్ని ప్రారంభోత్సవానికి వచ్చారు. అయితే తమ గ్రామంలోకి ఎమ్మెల్యేను రానివ్వమని వైసీపీ నేతలే అడ్డుకున్నారు. వైసీపీ నేత యజ్ఞల సత్యనారాయణ నేతృత్వంలో ఎమ్మెల్యే బాబూరావును అడ్డుకున్నారు.

కారును అడ్డుకుని....
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుకూల, ప్రతికూల వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తమ వర్గానికి చెందని వాలంటీర్లను ఎమ్మెల్యే కావాలని తొలగించారని వారు ఆరోపించారు. చాలాసేపు ఎమ్మెల్యే బాబూరావు తన కారులోనే ఉండిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టి చివరకు ఎమ్మెల్యేను ప్రారంభోత్సవానికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా వైసీపీలో బలమైన వర్గాలు ఏకమయ్యాయి. దీంతో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో రాజకీయ ఇబ్బందులు తలెత్తాయి.


Tags:    

Similar News