ఇద్దరి మధ్య "వరి" చిచ్చు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వరి ధాన్యం కొనుగోళ్లు చిచ్చు పెట్టాయి.

Update: 2021-11-26 03:55 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వరి ధాన్యం కొనుగోళ్లు చిచ్చు పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ధాన్యాన్ని తెలంగాణ సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. ఇటీవల కేసీఆర్ మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి వచ్చారు కూడా.

ఏపీలో పండిన....
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పండిన వరిధాన్యాన్ని అక్కడి రైతులు తెలంగాణకు తీసుకువస్తున్నారు. ఇక్కడి వ్యాపారులు కొనుగోలు చేస్తారన్న ఆశతో వస్తున్నారు. అయితే వాటిని సరిహద్దుల్లోనే తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన అనధికార ఆదేశాలతోనే అడ్డుకుంటున్నారు. తమకు వర్షాలు పడుతుండటంతో ధాన్యం నిల్వ చేయడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


Tags:    

Similar News