"డుంబు" సృష్టికర్త బుజ్జాయి మృతి

డుంబు పాత్ర సృష్టికర్త, కార్టూనిస్టు దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి మృతి చెందారు

Update: 2022-01-28 06:23 GMT

కార్టూన్ లలో డుంబు పాత్రకు ఒక విశిష్టత ఉంది. చిన్నతనంలో డుంబుగా ఊహించుకుంటూ అనేక మంది ఎదిగారు. డుంబు పాత్ర సృష్టికర్త, కార్టూనిస్టు దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతన్నారు. నిన్న చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. సుబ్బరాయ శర్మ ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు.

చిన్న నాటి నుంచే....
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి వయసు 91 సంవత్సరాలు. ఆయన 1931లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. చిత్రలేఖనం అంటే చిన్నప్పుటి నుంచి ఇష్టపడే సుబ్బరాయశర్మ బాపిరాజు గోఖలే, మొక్కపాటి వద్ద శిక్షణ పొందారు. వారి వద్ద మెలుకువలను నేర్చుకుని కార్టూనిస్టుగా ఎదిగారు. బుజ్జాయిగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆరు దశాబ్దాల నుంచి ఆయన కార్టూన్లు గీస్తున్నారు. సంపూర్ణ పంచతంత్రం పేరి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ఐదేళ్లు ధారావాహికగా ప్రచకురితమయింది. 1963లో ప్రారంభమయిన ఈ ధారావాహిక 1968 వరకూ కొనసాగింది. డుంబు పాత్రను సుబ్బరాయశర్మ సృష్టించారు. అప్పట్లో ఆంధ్రప్రభలో ప్రచురితమయ్యేది.


Tags:    

Similar News