జాహ్నవి దంగేటి: అంతరిక్ష కలలు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి, చంద్రుడిని తలపించే కృత్రిమ వాతావరణంలో పోలండ్‌లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొంది,

Update: 2025-06-27 13:30 GMT


పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి, చంద్రుడిని తలపించే కృత్రిమ వాతావరణంలో పోలండ్‌లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొంది, అంతరిక్షయానంలో మరో అడుగు వేశారు. గత ఏడాది ఆమె నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయురాలు. చిన్నతనంలో విన్న "పేదరాసి పెద్దమ్మ" కథలే తనను అంతరిక్ష విజ్ఞానం వైపు తీసుకెళ్లాయని జాహ్నవి తెలిపారు.

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాహ్నవి, 15 రోజుల పాటు సాగిన మూన్ సిమ్యులేషన్ ట్రైనింగ్‌లో తమ భౌతిక, మానసిక సామర్థ్యాలను పరీక్షించుకున్నారు. ఈ శిక్షణలో "ఆస్ట్రో-బయోలజిస్ట్"గా ఆమె టీమ్ సభ్యులకు సేవలందించారు. ASTRA-45 బ్యాచ్‌లో ఆమె అతి పిన్న వయస్కురాలైన విదేశీ అనలాగ్ వ్యోమగామిగా గుర్తించబడింది. ఆమె స్పేస్ ఐస్లాండ్ జియాలజీ శిక్షణకు ఎంపికైన మొదటి భారతీయురాలు, పీపుల్స్ ఛాయిస్ అవార్డు - NASA స్పేస్ యాప్స్ ఛాలెంజ్‌ను కూడా గెలుచుకున్నారు.

2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా జాహ్నవి ఎంపికయ్యారు, ఆమె నాసా సిద్ధం చేస్తున్న టైటాన్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్‌ ప్రయాణంలో భాగం కానుంది. ఇప్పటివరకు భారతదేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ మహిళా అంతరిక్ష యానానికి నేరుగా ఎంపిక కాకపోవడం, జాహ్నవి ఈ ఘనత సాధించడంతో ఇది భారతీయ మహిళలకు, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. దంగేటి జాహ్నవికి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.

తన అంతరిక్ష కలల సాకారానికి కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటి శిక్షణలు పొందారు. అంతరిక్ష అంశంపై ISRO ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు, NITలు వంటి ప్రముఖ సంస్థలలో ప్రభావవంతమైన చర్చల్లో పాల్గొని ప్రసంగాలు ఇచ్చారు. అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచేందుకు, భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేసేందుకు "స్పేస్ మ్యాజిక్" పేరుతో ఒక స్టార్టప్‌ను కూడా ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు అంతరిక్ష కెరీర్‌లో ప్రవేశించడానికి సహాయం చేయాలనుకుంటున్నానని జాహ్నవి చెబుతున్నారు. పాలకొల్లు వంటి చిన్న పట్టణం నుంచి వచ్చి ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని ఆమె నమ్ముతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లే ఏ అవకాశానికైనా జాహ్నవి ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News