Thu Dec 25 2025 06:09:48 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు వినతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని కలిశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని కలిశారు. గ్రేటర్ విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పాటుపై వినతి పత్రం అందించారు. విజయవాడ నగర పరిసరాల్లోని 74 గ్రామాల విలీనంతో...గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కేశినేని చిన్ని చంద్రబాబు ముందు ఉంచారు.
చంద్రబాబు వద్దకు...
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న గ్రేటర్ విజయవాడ ఏర్పాటు పై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూల స్పందించారు. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేశినేని చిన్ని వెంట ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు.
Next Story

