Thu Mar 12 2026 10:14:33 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh :నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెస్స్
నేడు రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ అమరావతిలోని సచివాలయంలో జరగనుంది.

నేడు రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ అమరావతిలోని సచివాలయంలో జరగనుంది. రెండో రోజు సూపర్ సిక్స్, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది పెట్టుబడులు వంటి అంశాలపై జరగనున్న చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించనున్నారు.
శాంతి భ్రదతలపై...
అలాగే జిల్లాల వారీగా ఆదాయం పెంచుకునే మార్గాలపైన కూడా ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించనున్నారు.దీంతో పాటు సంక్షేమానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అనంతరం చంద్రబాబు శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలతో సమీక్షించనున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడవద్దని హెచ్చరించనున్నారు.
Next Story

