Wed Mar 04 2026 13:01:37 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : మెడికల్ కళాశాలలపై మంత్రి క్లారిటీ ఇదే
శాసనసభలో ప్రభుత్వ వైద్య కళాశాలలు,పీపీపీ విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.

శాసనసభలో ప్రభుత్వ వైద్య కళాశాలలు,పీపీపీ విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు. రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీపీపీ విధానంలో పది వైద్య కళాశాలలను నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పదిహేడు కాలేజీల్లో పదకొండు నాబార్డు కింద, మూడు కేంద్రం, మూడు సాస్కి కింద మంజూరయ్యాయని చెప్పారు. దీనికి మొత్తం వ్యయం 8480 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 1, 500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని సత్యకుమార్ తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం...
అందులో పులివెందుల కాలేజీకి మాత్రమే దాదాపు రూ 500 కోట్లు ఖర్చుపెట్టి మిగిలిన కాలేజీల విషయంలో జగన్ వివక్ష ప్రదర్శించారని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.900 కోట్ల విలువైన పనులు చేసిందని, వైసీపీ ప్రభుత్వం నాడు కాలేజీలు నిర్మించేసామని అసత్య ప్రచారం చేస్తున్నారని, పార్వతిపురంలో వైద్య కళాశాల నిర్మాణానికి కనీసం భూ సేకరణ చేపట్టలేదని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలన కారణంగా 11 సీట్లకు పడిపోయారు. అయినా బెదిరింపులు ఆపడంలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు.
Next Story

