Andhra Pradesh : ఏపీ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరు 29వ తేదీన సీఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు నెలలు అంటే ఈనెల 28వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి సీఎస్ గా ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరియు ఈవో స్పెషల్ సిఎస్ టు సియంగా ఉన్న సాయి ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఆమేరకు శనివారం ఉ.11.33 గం.లకు ఏపీ సచివాలయంలో సాయి ప్రసాద్ నూతన సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్ కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు కాగా 1991 సెప్టెంబరు 15న ఐఏఎస్ కు ఎంపికై 1992 జూన్ నుండి 1993 మే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు.అనంతరం 1993 సెప్టెంబరు నుండి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్ గా,1995 ఆగస్టు నుండి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు.

