Fri Apr 10 2026 09:46:30 GMT+0530 (India Standard Time)
రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యూటీ మరియు సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ. 2950 కోట్ల చెల్లింపులు విడుదలయ్యాయి.
పోలీసుల సరెండర్ లీవులు...
ఈ మొత్తాలు సంబంధిత రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. సర్వీస్‌లో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. ఉద్యోగులుకు ముఖ్యంగా పెన్షనర్లకు ఇది ఉపశమనమని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
Next Story

