Mon Feb 16 2026 11:55:41 GMT+0530 (India Standard Time)
అమరావతికి చేరుకున్న బిల్ గేట్స్
ప్రముఖ పారిశ్రామిక వేత్త బిల్ గేట్స్ అమరావతికి చేరుకున్నారు

ప్రముఖ పారిశ్రామిక వేత్త బిల్ గేట్స్ ను గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, సత్యకుమార్ మరియు ఇతర మంత్రులు తో కలిసి సాదర స్వాగతం పలికారు. ఆయనను తీసుకుని అమరావతికి తీసుకుని వెళ్లారు. రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు అక్కడ చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు.
చంద్రబాబు తో భేటీ...
బిల్ గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు. బిల్ గేట్స్‌కు మంత్రులనుముఖ్యమంత్రి పరిచయం చేశారు. అనంతరం ఆర్టీజీఎస్ సేవలను ఆయన పరిశీలించారు. తర్వాత విజన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ను బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు.
Next Story

