Mon Mar 16 2026 10:58:58 GMT+0530 (India Standard Time)
Amaravathi : నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
అమరావతిలో నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరగనుంది

అమరావతిలో నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరగనుంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నేడు అమరావతిలో విగ్రహావిష్కరణ జరగనుంది. ఈరోజు ఉదయం 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.
తుళ్లూరు సమీపంలో...
పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మించిన స్మృతివనంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నారు.
Next Story

