Fri Mar 06 2026 12:57:48 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : చంద్రబాబు పాలన భేష్ : పవన్ కల్యాణ్
ఈ బడ్జెట్ దార్శనికతతో కూడినదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా

ఈ బడ్జెట్ దార్శనికతతో కూడినదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దూర దృష్టితో రూపొందించిన బడ్జెట్ ఇది అని అన్నారు. శాసనసభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తొమ్మిది కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లిందని తెలిపారు. విజన్ ఉన్న బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛన్నంతో పాలించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా గత ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిందని తెలిపారు.
గత సర్కార్ పాలసీతో...
గత సర్కార్ పాలసీతో విద్యుత్తు సరఫరాలో అనేక లోపాలు తలెత్తాయని అన్నారు. జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏదీ సక్రమంగా వినియోగించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణ పనులను కూడా చేపట్టామని తెలిపారు. ప్రజలకు నిజంగా మంచి చేయాలనుకున్నప్పుడు చేయవచ్చని కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే నిరూపించిందన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రం దిగజారి పోయిందని, అందుకే 2014లో తాను కూటమికి మద్దతిచ్చానని, 2024 ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా ఆశించకుండా బేషరతుగా మద్దతిచ్చానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తాను ఏపీ అభివృద్ధిని కోరుకునే తాను డిమాండ్ చేయలేదని అన్నారు.
Next Story

