Mon Jan 12 2026 06:46:38 GMT+0000 (Coordinated Universal Time)
ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో నేడు
రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో మంత్రి నారాయణ పాల్గొన్నారు.

రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. పెదకూరపాడు మండలం కర్లపూడి - లేమల్లె లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు మంత్రి స్వీకరించారు. గ్రామంలో 2654 ఎకరాలకు కాంపిటెంట్ అధారిటీ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొందరు రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చేందుకు అంగీకరించారు.
స్వచ్ఛందంగా ఇస్తూ...
ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ కు రైతులు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసినందుకు సీఏం చంద్రబాబు,మంత్రి నారాయణ కు ధన్యవాదాలు రైతులు తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 7 గ్రామాలకు గాను 4 గ్రామాల్లోల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రైతులు రెండో విడత భూ సమీకరణకు సుముఖంగా ఉండి వారు స్వచ్ఛందంగా తమ భూములను ఇస్తున్నారని, వారికి వీలయినంత త్వరగా అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగిస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా రైతులకు తెలిపారు.
Next Story

