Tue Mar 24 2026 15:10:06 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : లోకేష్ ప్రజాదర్బార్ లో సమస్యలివీ
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ లో కాలం తీరిన బాక్స్ లకు 59 రూపాయల రెంటల్ ను తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను సంబంధిత మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
న్యాయవాదుల సమస్యలపై...
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో తన 0.81 ఎకరాల భూమిని ఆన్ లైన్ లో నమోదుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన ముత్తే సాంబశివరావు కోరారు. రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని ఏలూరుకు చెందిన నిమ్మల జ్యోతి కుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ మొగల్రాజపురంలోని తమ ఖాళీ స్థలానికి సంబంధించి వేరొక వ్యక్తి పేరుపై అక్రమంగా ఇంటి పన్ను విధించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు సదరు పన్నును రద్దుచేసి న్యాయం చేయాలని గూడపాటి కోటేశ్వరరావు కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Next Story

