Wed Feb 11 2026 17:02:05 GMT+0530 (India Standard Time)
పవన్ కళ్యాణ్ తో నారా లోకేశ్ భేటి
అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి నారా లోకేశ్ భేటి అయ్యారు.

అసెంబ్లీ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ భేటి అయ్యారు. అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు వెళ్లిన లోకేశ్ ఆయనతో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాల పై ఇరువురి మధ్య చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా రాజకీయ పరిణామాలపై...
ఈ రోజు గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం, ఆ తరువాత ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు పై పవన్ కల్యాణ్, లోకేశ్ లు చర్చించారు. దీంతో పాటు ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
Next Story

