Tue Dec 09 2025 08:55:13 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతులకు నారాయణ బంపర్ ఆఫర్
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు.

రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు,గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం,రైతుల ప్లాట్ లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులు పరిశీలించారు. మంతి నారాయణ తో పాటు పర్యటనలో అధికారులు పాల్గొన్నార. రైతులకు ఇచ్చిన ప్లాట్ లలో మౌళిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రెండేళ్లలో డ్రైనేజ్ లు,.రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని తెలిపారు. సీడ్ యాక్సిస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులో కి తెస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసమీకరణ చేపడతామన్నారు.
ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి...
లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు తీసుకున్న వారి సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరీష్కరిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ లు ఉన్న 11, 8జోన్ల లో మినహా అమరావతి పరిధిలోని 29గ్రామాల పరిధిలో పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. 66వేల ఫ్లాట్స్ లో 7వేల ఫ్లాట్స్ మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్ లు చేయాల్సి ఉందని తెలిపారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ రోజుకు 30నుంచి 60మంది చేసుకుంటున్నారన్న మంత్రి నారాయణ 450మంది రైతులకు ఇవ్వాల్సిన 1891 ఫ్లాట్స్ కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నాయని తెలిపారు. విదేశాల్లో ఉన్న వాటితో పాటు ఇతరత్రా రిజిస్ట్రేషన్ లు రోజుకు వెయ్యి చేసేలా అధికారులను అందుబాటులో పెట్టామని, రైతులు ముందుకొచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి నారాయణ కోరారు.
Next Story

