Sat Mar 28 2026 12:56:31 GMT+0530 (India Standard Time)
అమరావతిలో పనుల పురోగతిపై నారాయణ పరిశీలన
రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్ట్ ల నిర్మాణాలు మంత్రి నారాయణ పరిశీలించారు

రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్ట్ ల నిర్మాణాలు మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును ఓల్డ్ హైవే కు కలిపే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ గుంటూరు ఛానల్ పై సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానించే బ్రిడ్జి పనులు కూడా పరిశీలించారు. రెండు బ్రిడ్జిల పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమ బైపాస్ పనులను...
విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ, ఇప్పటికే వెస్ట్ బైపాస్ పై ఒకవైపు వాహనాలకు అనుమతిచ్చిన ఎన్ హెచ్ అధికారులు, వెస్ట్ బైపాస్ రోడ్డు రెండు వైపులా అనుమతిస్తే గుంటూరు,విశాఖపట్నం నుంచి నేరుగా రాజధానిలోకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Next Story

