Mon Mar 16 2026 14:36:53 GMT+0530 (India Standard Time)
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం : మంత్రి నారాయణ
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు

రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. 53 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ 5 జీఏడీ టవర్లలో రానుందని మంత్రి నారాయణ చెప్ారు. అన్నీ ఒకేచోట కొలువుదీరేలా జీఎడీ టవర్ల నిర్మాణం ఉంటుందని చెప్పారు. 2028 నాటికి అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ప్రజాప్రతినిధుల నివాసాలకు వాటర్ కనెక్షన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి జీఏడీకి అప్పగిస్తాంమంత్రి నారాయణ చెప్పారు.
అన్నీ ఓకే చోట..
రాజధానిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం ప్రారంభమయింది. డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో జీఏడీ,హెచ్ ఓడీ లకు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని చెప్పారు. జీఏడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో మిగిలిన టవర్లు 40 అంతస్తులతో నిర్మిస్తున్నామని,అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా టవర్ల నిర్మాణం ప్లాన్ చేశామన్నారర. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకేచోట అన్ని కార్యాలయాలు ఉండేలా డిజైన్ చేశామని, 2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని మంత్రి నారాయణ చెప్పారు.
Next Story

