Sun Dec 14 2025 00:20:51 GMT+0000 (Coordinated Universal Time)
Amarvathi : రాజధాని రైతులకు నారాయణ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నారాయణ ఈరోజు వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెంలో పర్యటించారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్బంగా మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.
ప్లాట్ల రిజస్ట్రేషన్లు వేగంగా...
రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్లు కూడా వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటి వరకూ 69,421 ప్లాట్లకు గాను, 62,433 ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా 7,899 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు మాత్రమే మిగిలాయని రోజుకు ముప్ఫయి నుంచి నలభై ప్లాట్లను రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని లో మౌలిక సదుపాయల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. రోడ్లు, మంచినీటి పైపులైన్ల నిర్మాణపు పనులు కూడా మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.
Next Story

