Sat Dec 20 2025 06:49:05 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేడు మంగళగిరిలో లోకేశ్ పర్యటన
నేడు మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు.

నేడు మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు మంత్రి లోకేష్ చేరుకుంటారు. కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న మంత్రి లోకేష్ వారి సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయనన్నారు.
పార్టీ పదవుల విషయంలో...
పార్టీ పదవుల భర్తీపై నేతలతో మంత్రి లోకేష్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లి పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. పార్టీ పదవుల విషయంపై చర్చించి నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే జిల్లాలు, రాష్ట్ర కమిటీ దాదాపుగా ఖరారయింది.
Next Story

