Thu Feb 12 2026 14:58:57 GMT+0530 (India Standard Time)
నేడు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో లోకేశ్
కొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు

కొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఒక్కోరోజు ఒక్కో పార్లమెంటు నియోజకర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు కుటుంబ సమేతంగా నారా లోకేశ్ డిన్నర్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
కుటుంబ సభ్యులతో డిన్నర్...
ఎమ్మెల్యేలతో పాటు వారి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి సమస్యలను గురించి నారా లోకేశ్ తెలుసుకోనున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చించనున్నారు. ఈరోజు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను వినడంతో పాటు వారితో ఫొటోలు దిగి వారితో కాసేపు గడపనున్నారు. నిజంగా ఇది కొత్త సంప్రదాయమే.
Next Story

