Tue Mar 31 2026 15:10:57 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : టీడీపీ ఆఫీసులో నారా లోకేష్ ప్రజా దర్బార్
మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ తండ్రికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఏ.అరవింద్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఆర్.చంద్రంపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలని డి.తేజ కోరారు.
వివిధ సమస్యలపై...
అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో ఉన్న మసీదు శిథిలావస్థకు చేరుకుందని, నూతన మసీదు నిర్మాణానికి సాయం అందించాలని జామియా మసీదు కమిటీ సభ్యులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వారసత్వంగా సంక్రమించిన తమ 0.36 ఎకరాల వ్యవసాయ భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయాలని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం, కె.బిట్రగుంటకు చెందిన మన్నేపల్లి రజని విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Next Story

