Wed Apr 01 2026 15:03:12 GMT+0530 (India Standard Time)
అమరావతి పేరిట దోపిడీ జరుగుతుంది : మిధున్ రెడ్డి
రాజధాని అమరావతి కోసం రైతులు 39 వేల ఎకరాలు ఇచ్చారనని మిధున్ రెడ్డి అన్నారు

రాజధాని అమరావతి కోసం రైతులు 39 వేల ఎకరాలు ఇచ్చారనని మిధున్ రెడ్డి అన్నారు. 2014 -2019 మధ్య కాలంలో కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, నేటి వరకూ రైతులకు ప్లాట్లు కేటాయించలేదని, రైతులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారని మిధున్ రెడ్డి అన్నారు. ఒక్క ప్లాట్ కూడా రైతులకు కేటాయించడం లేదన్నారు. భూములిచ్చిన రైతులకు అనేక హామీలిచ్చారని, కానీ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అమరావతి కోసం ఇప్పటికే 34 ఎకరాలు, ప్రభుత్వ భూమి ఇరవై ఎకరాలున్నా కూడా మరో యాభై ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం సిద్ధమవుతుందని అన్నారు. 10,500 ఎకరాల్లో న్యూఢిల్లీ ఉందని కానీ అమరావతి కోసం లక్ష ఎకరాలను సేకరిస్తున్నారని అన్నారు.
రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది?
ఎప్పుడు రాజధాని అమరావతి పూర్తవుతుందని, మరోసారి భూసేకరణ ఎందుకని మిధున్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటున్నారని, ఎక్కడి నుంచి తెచ్చి కడతారని మిధున్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్ర ప్రభుత్వం గతంలో హైకోర్టులో అఫడవిట్ అనుమతించిందని మిధున్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో పీడబ్ల్యూడీ డిపార్ట్ మెంట్ ఎంపీ క్వార్టర్ నియమించాలంటే నాలుగువేలని, కానీ అమరావతి లో మాత్రం పన్నెండు వేలు చెల్లిస్తున్నారని మిధున్ రెడ్డి అన్నారు. సీఎం రమేష్ లాంటి వారు కాంట్రాక్టర్ అని, ప్రజల ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనమని అన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు నిర్మించాలని అనుకున్నది అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడం కోసమేనని అన్నారు. అమరావతి రాజధాని రైతుల ప్రయోజనం లేకుండా ప్రవేశపెట్టిన ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని మిధున్ రెడ్డి చెప్పారు.
Next Story

