Sat Mar 28 2026 14:43:41 GMT+0530 (India Standard Time)
నేడు సాగు నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం
నేడు అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది

జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నేడు అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ళ వైసిపి విధ్వంశ పాలనకు ఇరిగేషన్ వ్యవస్ధ గాడి తప్పిందని, 18వేల కోట్ల రూపాయిల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని చెప్పనున్నారు.
నీటి నిర్వహణపై...
ఖరీఫ్ పంట ముగిసినా రాయలసీమలో సైతం, రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్ మెంట్ వల్లే సాధ్యమైందని ప్రజలకువివరించాలని చెప్పనున్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకుని, భూమిని కూడా రిజర్వాయర్ లా మార్చుకోవాలని, భూగర్భజలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భజలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సిఎం చంద్రబాబు దిశా, నిర్దేశం చేయనున్నారు.
Next Story

